తాడిపత్రిలో గ్యాస్ సిలిండర్లు సీజ్

తాడిపత్రి మండలంలోని వెంకటంపల్లి గ్రామ పొలాలలో ఉన్న కంకర్ ఫ్యాక్టరీ వద్ద అక్రమంగా గ్యాస్ సిలిండర్లను డంప్ చేశారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తాడిపత్రి రూరల్ ఎస్సై కాటయ్య, CSDT మల్లేష్, స్పెషల్ టీం కలిసి ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 133 డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్