తాడిపత్రి మండలం చల్లావారిపల్లి వద్ద హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ లో భాగంగా హిజ్రా మల్లికను కిడ్నాప్ చేసి, హత్య చేసి, రైలు పట్టాలపై పడేసిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మల్లికను ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసారు. ఈ హత్య గ్యాంగ్ వార్ లో భాగంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట హిజ్రాలు మల్లిక మృతదేహంతో ధర్నా చేసిన విషయం తెలిసిందే.