తాడిపత్రిలో భారీగా బంగారం స్వాధీనం

తాడిపత్రిలో గురువారం అర్థరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులకు బిల్లులేని బంగారం, నగదు పట్టుబడింది. కడప-అనంతపురం రహదారిపై సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీ చేసిన సమయంలో ఓ కారులో 1,123.92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,48,700 నగదు లభించాయి. వాటిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కమర్షియల్ అధికారులకు అప్పగించనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్