పెద్దవడుగూరులో శుక్రవారం జరిగిన 'మన ఊరి సయ్యాట' కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు శాంతకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో, ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల నటనను అనుకరిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.