తాడిపత్రిలో అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

తాడిపత్రిలోని పెన్నానదిలో గాంధీనగర్కు చెందిన షేక్ హుస్సేన్ షా అనే యువకుడు మృతి చెందాడు. నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై ధరణి బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతిగా మద్యం సేవించి అనారోగ్యంతో మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడి కుమారుడు మహబూబాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్