యాడికిలోని వెంగమ నాయుడు కాలనీలో దర్గా కట్టపై కూర్చున్న వ్యక్తి ఉన్నఫలంగా కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. వడదెబ్బ, గుండెపోటు లేదా ఇతర అనారోగ్య కారణాలా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.