శనివారం యాడికి మండలం పెద్దపేట గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.