మద్యం దుకాణంలో భారీ చోరీ

యాడికి మండలంలోని రాయలచెరువులో ఉన్న శ్రీలక్ష్మీరంగా మద్యం దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు దుకాణానికి తాళాలు వేసి వెళ్లగా, ఆదివారం ఉదయం దుకాణం తెరిచేందుకు రాగ కిటికీ పగలగొట్టి ఉన్నట్లు గుర్తించారు. లోపలికి ప్రవేశించిన దొంగలు టేబుల్ సొరుగులో ఉన్న రూ.30వేలు నగదుతో పాటు రూ.2.25 లక్షలు విలువైన మద్యం సీసాలను అపహరించారు. సీసీ కెమెరా పుటేజీలో ముఖానికి రుమాలు కట్టుకున్న నిందితుడు కనిపించాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్