తాడిపత్రి పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జెసి

సోమవారం తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజారులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్లు, ఎక్సఫిసియో మెంబర్లు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్