తాడిపత్రి మండలంలోని ఆలూరులో జరుగుతున్న శ్రీ ఆలూరుకోన శ్రీ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కళ్యాణోత్సవానికి పట్టువస్త్రాలను సమర్పించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు స్వాగతం పలికి, స్వామివారి దర్శనం చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.