రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

పెద్దవడుగూరు మండలం 44వ జాతీయ రహదారిపై కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా బాధితుడిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్