పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి యాడికి కాలువ బ్రిడ్జిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం ధ్వంసమై డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.