యాడికిలో గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

యాడికి మండలం కోనలో బుధవారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ కలకలం రేపింది. గుత్తికి చెందిన అజయ్ అనే విక్రయదారుడు, మరో 15 మంది యువకులు కలిసి పార్టీ చేసుకున్నారు. గంజాయి మత్తులో కారును నిర్లక్ష్యంగా నడుపుతూ స్థానికులను భయపెట్టారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్