తాడిపత్రిలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల చెట్ల వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సీఐ ఆరోహణరావు తన బృందంతో కలిసి ఈ దాడి చేశారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,49,000 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.