మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మంచంలో పడుకొని నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం టీడీపీ కౌన్సిలర్లపై పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జేసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన అనుచరగణంతో కలిసి పోలీస్ స్టేషన్ ముందే వినూత్న నిరసనకు దిగారు.