తాడిపత్రిలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

శనివారం సాయంత్రం తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,700 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్