పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతి

పెద్దవడుగూరు మండలంలోని తెలికి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సాంబశివుడు (51) గురువారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. తన గొర్రెల మంద వద్ద ఉన్న సమయంలో ఆకస్మికంగా ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్