గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి

యాడికి మండలం చందన గ్రామంలో బుధవారం ఆరు సంవత్సరాల నైనిక అనే బాలిక గుండెపోటుతో మరణించింది. ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన నైనికను తల్లిదండ్రులు రాయలచెరువు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్