తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవస్థానాన్ని చంద్రగ్రహణం కారణంగా ఆలయ చైర్మన్ చంద్రమోహన్, అర్చకుల సమక్షంలో మూసివేశారు. వేకువజామునే అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామి చెంత దర్భ రక్ష ఉంచి ఆలయ తలుపులు మూసివేసినట్లు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం రేపు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.