యాడికి మండల కేంద్రంలో శ్రీ శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు కళ్యాణోత్సవం అట్టహాసంగా జరిగింది. చంద్ర గ్రహణం కారణంగా, తెల్లవారుజామున 3 గంటలకే కళ్యాణ మండపంలో శ్రీ శివ లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణోత్సవం చేపట్టారు. భక్తుల నామస్మరణతో 'శ్రీ చెన్నకేశవస్వామి గోవిందా గోవిందా' అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోయింది.