ప్రమాదవశాత్తు కాలువలో పడి విద్యార్థి మృతి

శనివారం పెద్దవడుగూరు మండలం బుర్నాకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పృథ్విరాజ్ యాడికి కాలువలో పడి మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లేందుకు కాలువ దాటుతుండగా జారిపడి ఊపిరాడక మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్