తాడిపత్రి శాసనసభ్యులు పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి పుట్లూరు మండలం కొండాపురం వరకు ఉన్న ఫ్లడ్ ఫ్లో కాలువలో చేయాల్సిన పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలో చేయాల్సిన పనులను గూర్చి అధికారులతో చర్చించారు. ప్రభుత్వం నుంచి నిధులు తొందరగా మంజూరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.