తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ (30వ వార్డు ) నందు లబ్ధిదారులకు వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కన్న కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు పంపిణీలో వృద్దులకు న్యాయం జరుగుతోంది అన్నారు.