తాడిపత్రి మండలంలోని కోమలి గ్రామాన్ని సోమవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సందర్శించారు. గ్రామస్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పీర్ల చావిడిని ప్రారంభించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.