పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ కేసు వాయిదా ఉండటంతో కోర్టుకు హాజరయ్యారు. అయితే వారు కోర్టుకు హాజరైన సమయంలో వారి వెంట కొడవలి ఉందని తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి వారి వద్ద నుంచి కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు.