పుట్లూరు మండలంలో విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలు

పుట్లూరు మండలంలో దొంగతనాలు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న పుట్లూరులో చోరీ జరగగా, నేడు దోసలేడులో 10 వ్యవసాయ బోరుబావుల నుంచి విద్యుత్ కేబుల్ వైర్లను దొంగలు అపహరించారు. ఈ వరుస దొంగతనాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమ కష్టానికి భద్రత కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలను అరికట్టడానికి పోలీసులు వెంటనే స్పందించి, గస్తీని పెంచాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్