పుట్లూరు మండల కేంద్రంలో వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ కేబుళ్ల చోరీలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా శంకర్ రెడ్డి, సుబ్బానాయుడు, భూమిరెడ్డి చిన్న నారాయణరెడ్డిలకు చెందిన మూడు బోరుబావుల విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ వరుస దొంగతనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొంగలను పట్టుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.