యాడికిలో ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్ట్

యాడికి మండలం కోన ఉప్పలపాడు సమీపంలోని కోన మల్లేశ్వరస్వామి దేవాలయం వద్ద గంజాయి విక్రయిస్తున్న గుత్తికి చెందిన అజయ్ రాజ్, అజయ్ వర్మలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారయ్యారు. ఈ ఘటనపై యాడికి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్