అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక పెద్దవడుగూరు మండలం ముప్పలగుత్తికి చెందిన రైతు రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసైన ఆయన, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్