తాడిపత్రి మండలం చిన్నపొడమలలో ఎద్దుల బండిని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో గంగాధర్, విజయ్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం నుంచి మంటలు వ్యాపించడంతో, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.