తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన వీఆర్వో రామకృష్ణ, రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా అనంతపురం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. రామకృష్ణ ప్రస్తుతం ఆలూరుతో పాటు సజ్జలదిన్నె, వెలమకూరు సహా ఐదు గ్రామాలకు ఇన్ఛార్జ్ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.