యాడికి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వేములపాడు వంక పొంగి పొర్లడంతో నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.