నంబర్ ప్లేట్లు లేని వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తాం: సీఐ

తాడిపత్రిలో నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తామని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి హెచ్చరించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పేకాట, మట్కా కేంద్రాలపై దాడులు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకున్నామని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్