యాడికిలో భర్తను చంపిన భార్య

యాడికి మండలం పెద్దపేటలో ప్రసాద్ అనుమానాస్పద మృతి కేసులో భార్య హైమావతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాగుడుకు బానిసైన ప్రసాద్‌తో తరచూ గొడవలు జరిగేవని, శుక్రవారం రాత్రి జరిగిన గొడవలో భార్య కర్రతో కొట్టడంతో ప్రసాద్ మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు, లోతుగా విచారించగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్