యాడికి: బైక్ బోల్తా.. వ్యక్తి మృతి

యాడికి మండలంలోని చందన గ్రామం దగ్గర శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో విజయ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో, పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్