రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

ఎల్లనూరులోని సాయిబాబా గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేశ్ కుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జంగంపల్లిలో జరుగుతున్న 'రణబలి' సినిమా షూటింగ్ చూసి బైక్‌పై తిరిగి వస్తున్న అతడిని, ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన నరేశ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్