తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన నిశాంత్, అంకిరెడ్డిపల్లి నుండి బైక్‌పై తిరిగి వస్తుండగా, అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలో చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.