తాడిపత్రి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన రూరల్ మండల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలన, వివరాల ధృవీకరణ వంటి అంశాలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.