మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

సత్య సాయి జిల్లా రొళ్ల మండలంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ షమీఉల్లా సూపర్ వైజర్ లీలావతి ఆధ్వర్యంలో బుధవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు" కార్యక్రమం నిర్వహించారు. జూన్ నెలను రాష్ట్ర ప్రభుత్వం మలేరియా వ్యతిరేక మాసంగా ప్రకటించింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం  ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి, వారంలో ఒక్కసారి నిలువ ఉన్న నీటిని పారబోసి, కొత్త నీటిని పట్టడం ద్వారా దోమల లార్వాలను నశింపజేసి, దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా రొళ్లలో మలేరియా నియంత్రణపై ర్యాలీ కూడా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్