అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతపై సమాజంలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ ర్యాలీలు చేపట్టారు. పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది, శక్తి టీమ్స్, యువ పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.