ఉరవకొండ మండలం రాయంపల్లిలో సైబర్ మోసం కలకలం రేపింది. రైతు రాజు బ్యాంక్ ఖాతా నుంచి రూ. 1.14 లక్షలు ఎటువంటి ఓటీపీలు, స్పామ్ కాల్స్ లేకుండానే డెబిట్ అయ్యాయి. నగదు మాయం కావడంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే బ్యాంక్ అధికారులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.