చాబాలలో ఉచిత కందుల పంపిణీ

వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా ఉచితంగా కందులను శుక్రవారం సర్పంచ్ మల్లెల జగదీష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కళ్యాణి, టీడీపీ నాయకులు పంపాపతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్