కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఎలహంక ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల పుస్తెలతాడును దొంగిలించారు. ఉరవకొండకు చెందిన నరసింహప్ప తన భార్య లక్ష్మీదేవి (66)తో కలిసి కాచిగూడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు ఈ మేరకు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప ఈ వివరాలను వెల్లడించారు.