గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న కంది రైతులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చింది. బెళుగుప్ప మండలంలో 18వేల ఎకరాల్లో సాగు చేసిన కంది పంటను పొలాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.7వేలతో కొనుగోలు చేయడానికి ఏకమైన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా రూ.8వేలతో కొనుగోలు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.