కూడేరు మండల కేంద్రంలోని గొట్టుకూరు గ్రామంలో ఉన్న బెరాకా వృద్ధాశ్రమం అర్ధరాత్రి వేళ మహిళకు ఆశ్రయం కల్పించింది. వివరాల్లోకి వెళితే కూడేరు మండలం అనంతపురం బళ్లారి జాతీయ రహదారిపై అనుమానస్పదంగా సంచరిస్తున్న మహిళను బెరాక ఆశ్రమం వారు గమనించారు. రాత్రి ఆశ్రమంలోనే వసతి కల్పించారు. ఈమె సింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అని, భర్త చలపతి రెండవ పెళ్లి చేసుకుని తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది.