అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.