ఉరవకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ "ప్రజాదర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు, నాయకుల సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకుని, అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.