పెన్నహోబిలం ఆలయంలో ఈ నెల 27న బహిరంగ వేలం

ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు కలగలపు బియ్యం బేడల విక్రయ హక్కుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో రమేశ్ బాబు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఛైర్మన్ రేగటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ఈ వేలం జరుగుతుందని చెప్పారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డు నకలు తీసుకొని హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్