తేమ శాతం ఎక్కువై సోకిన వేరుకుళ్లు- నిలువునా ఎండిపోతున్న పంట

బెళుగుప్ప, విడపనకల్లు మండలాల్లో పప్పుశనగ పంటకు మొంథా తుఫాన్ ముప్పు తెచ్చింది. ఈ నెల మొదటి నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల ఎకరాలకు పైగా పప్పుశనగ పంట సాగు చేశారు. తాజాగా మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. దీంతో నల్లరేగడి భూముల్లో తేమ శాతం ఎక్కువైంది. పప్పుశనగ పంటకు వేరుకుళ్లు తెగులు సోకి నిట్టనిలువునా ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్