నేటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమిద్యాల గ్రామం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో పెన్నహోబిలానికి తీసుకువచ్చారు. క్షేత్రానికి చేరుకున్న విగ్రహాలకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, అర్చకులు మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్